![]() |
![]() |

బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆగష్టు 22 నుంచి టెలికాస్ట్ కాబోతోంది. ఇక ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఎంట్రీతోనే ట్విస్ట్ మొదలయ్యింది. జడ్జెస్ గా నవదీప్, బిందు మాధవి, అఖిల్ కూర్చున్నారు. హోస్ట్ గా శ్రీముఖి వచ్చేసింది. "నా లాంటి కంటెస్టెంట్ రాలేదు, రాడు అని విని విని అలిసిపోయి సరేరా భాయ్ ఆ పని నేనే చేసి పంపిస్తా అని చెప్పి వచ్చా ఇక్కడికి" అన్నాడు అభిజిత్ . ఇక స్టేజి మీద ఒక బ్లాక్ మాస్క్ మ్యాన్ వచ్చాడు. "నీ పేరేంటి" అని నవదీప్ అడిగేసరికి "స్కిన్ నేమ్ హరీష్..సోల్ నేమ్ హృదయ్ మానవ్" అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఇక బిందు మాధవికి ఆ పేరేంటో కొత్తగా అనిపించినట్టుగా ఉంది " హృదయ్ మానవ్ అంటే ఏంటి" అని అడిగింది. "హృదయమున్న మానవుడిని" అని ఆన్సర్ ఇచ్చాడు ఆ మాస్క్ మ్యాన్. "ఎం మా అందరికీ లేవన్నా" అని నవదీప్ కౌంటర్ వేసాడు. "మీకు కావాలంటే అలాగే అనుకోవచ్చు" అన్నాడు మాస్క్ కంటెస్టెంట్. "చిన్నప్పటి నుంచి చాల కోపిష్టి మనిషిని" అని కూడా మాస్క్ కంటెస్టెంట్ చెప్పుకున్నాడు. వెంటనే శ్రీముఖి " కోపం వచ్చినప్పుడు ఎం చేస్తారు" అని అడిగింది. "కోపాన్ని నేను రివీల్ చేసేస్తా" అన్నాడు. "కొడతావా" అని బిందు మాధవి అడిగేసరికి "ఔను" అన్నాడు.
"బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది మనం ఫ్రెండ్ షిప్ చేసుకోవడానికి వెళ్తామా" అని మాస్క్ మ్యాన్ అడిగాడు. "ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు" అని అభిజిత్ అడిగాడు. "ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేస్తారా" అని మాస్క్ కంటెస్టెంట్ కౌంటర్ ఇచ్చాడు. "ఇది చాలా బాడ్" అంది బిందు మాధవి. అభిజిత్ రెడ్ స్కేల్ చూపించాడు. "మీరు నా క్యారెక్టర్ ని డిసైడ్ చేయొద్దు" అని గట్టిగానే చెప్పాడు ఆ మాస్క్ కంటెస్టెంట్. "డోంట్ జడ్జ్ మీ అంటే కుదరదు. మేము జడ్జెస్. మిమ్మల్ని జడ్జ్ చేయడానికే ఇక్కడ కూర్చున్నాం" అన్నాడు. "కొన్ని నిమిషాల్లోనే క్యారెక్టర్ చేసే వాళ్ళు ఐతే మీరు దేవుళ్ళకి ఉండాలి" అని మళ్ళీ కంటెస్టెంట్ కౌంటర్ అటాక్ ఇచ్చాడు. "నేను దేవుడిని కాదు" అని బిందు మాధవి అంది. "కాదు కాబట్టే యు ఆర్ రాంగ్" అనేశాడు. అంతే వెంటనే బిందు మాధవి లేచి వెళ్లి మేడలో "లూజర్" అనే టాగ్ వేసింది. "నువ్వేదో మాట్లాడుతున్నావ్ నాకేం అర్ధం కావట్లేదు నీ మాస్క్ తీసి మాట్లాడు" అని చెప్పింది. వెంటనే అతను మాస్క్ తీసేసాడు.
![]() |
![]() |